ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మనమంతా లోతుగా అర్థం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో దేశం యుద్ధం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయంలో ఆ భారాన్ని, బరువుని గుండెల్లో పెట్టుకుని, వేదనతో ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మరవకుండా ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమన్నారు. "బాధితుల రోదనలు వింటే ఎంతో బాధ కలిగింది. పహల్గాం దాడి దేశం మొత్తం మీద జరిగిన దాడి. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సమయం ఇచ్చి అమరావతికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆయనకు మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని కోరుకుందాం" అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
#pawankalyan #amaravati #narendramodi #pahalgamattack #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️